భారతదేశం, మార్చి 25 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో శివ వీడియోను వైరల్ చేయాలన్న రోహిణి ప్లాన్ సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఆమె తన కన్నింగ్ ఆలోచనలతో ఆ వీడియోను ఇంట్లో వాళ్లు కూడా చూసేలా చేస్తుంది. దీంతో ప్రభావతి ఉగ్రరూపం చూపిస్తూ శివను చెప్పుతో కొడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మార్చి 25) ఎపిసోడ్ మీనా నెత్తిపై బల్లి పడే సీన్ తో మొదలవుతుంది. ఆమె కంగారు ఆ బల్లిని తీసి పారేస్తే అది మొదట ప్రభావతిపై, తర్వాత రోహిణి, మనోజ్ లపై పడుతుంది.

ఏం జరుగుతుందో అని ప్రభావతి కంగారు పడుతుంటే.. రోహిణి ఫోన్ చూసి బల్లిశాస్త్రం చెబుతుంది. తమ ముగ్గురికీ మంచే జరుగుతుందని, అయితే మీనాకు తలపై పడటం వల్ల ప్రాణగండంతోపాటు చాలా కష్టాలు కూడా రానున్నాయని చెబుతుంది.

దీంతో మీనాలో ఆందోళన మొదలవుతుంది. దా...