భారతదేశం, సెప్టెంబర్ 8 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వరలక్ష్మీ వ్రతంలో ఏమేం చేయాలో రోహిణికి చెబుతుంది ప్రభావతి. ఇదన్నా నువ్వు నిష్టగా చేస్తే నువ్వు చేసిన కుట్రలు కాస్తాన్నా క్షమించబడతాయి. అమ్మవారి దయ ఉంటుందని ప్రభావతి చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు మీనా తన జుట్టుకున్న తడి ఆరుపుకుంటుంది. బాలు చూసి ముట్టుకుంటే.. అసుంట అసుంట అని మీనా అంటుంది. తాకరాదు అని వ్రతం గురించి చెబుతుంది మీనా. దాంతో కొత్త పూలగంప దగ్గరికి వెళ్తానని బాలు అంటాడు. సరే, వ్రతం అయ్యాక ఆశీర్వదించాలని మీనా చెబుతుంది. బాలు బయటకెళ్లేసరికి రవిని కూడా శ్రుతి తోస్తుంది.

ఇద్దరికి ఒకే పరిస్థితి అని బాలు, రవి అనుకుంటారు. రోహిణి విషయంలో మాత్రం రివర్స్ అని, పార్లరమ్మనే మనోజ్ గాడు గెంటేసుంటాడని బాలు అంటాడు. మౌనిక రెడీ క...