భారతదేశం, ఆగస్టు 12 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం తల్లి సుశీల పంచాయితీ పెట్టడంతో రోహిణి మరో కట్టు కథ అల్లుతుంది. అంతవరకూ ఆవేశంతో ఊగిపోయిన ప్రభావతి కాస్త కరిగినట్లు కనిపించగా.. బాలు, రవి మాత్రం మరో కొత్త కథ అల్లుతున్నావా అంటూ ముఖం మీదే కరిగి పాడేస్తారు.

సుశీల వచ్చి రోహిణికి ఫోన్ చేయమని మనోజ్ కు చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 12) ఎపిసోడ్ ప్రారంభమైంది. మూడుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని పార్లరమ్మ.. తర్వాత మాట్లాడుతుంది. మొదట మనోజ్ తో మాట్లాడటానికి బెట్టు చేస్తుంది. బామ్మ వచ్చిందని, ఇంటికి రమ్మంటోందని పిలుస్తాడు.

అంటే నువ్వు రమ్మనడం లేదా అని అడుగుతుంది. తర్వాత రోహిణి దిగి వస్తుంది. సరే వస్తానని చెబుతుంది. మళ్లీ ఇంటికి వెళ్లే అవకాశం రావడ...