భారతదేశం, ఆగస్టు 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తను చేసిన తప్పేంటని రివర్స్‌లో వాదించిన రోహిణిని అత్త ప్రభావతి ఎడాపెడా కొడుతుంది. నువ్వు ప్రశ్నిస్తున్నావా. అసలు ఏం పుట్టుకే నీది, అడుగడుగునా మోసం చేస్తూ భ్రమలో పెట్టి ఇంతకాలం నా ఇంట్లో ఎలా ఉన్నావే ముదనష్టపుదానా అని రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి.

నోరు తెరిస్తే అబద్ధం, ఆస్తులు అబద్ధం, నాన్న అబద్ధం, మేనమామ అబద్ధం. నీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుందని మరోసారి పీక పట్టుకుంటుంది. శ్రుతి అడ్డుకుంటే తోసిపడేస్తుంది ప్రభావతి. నిన్ను చంపి జైలుకు వెళ్తే కుటుంబ పరువుపోతుందని ఆగాను. నిన్ను నమ్మి దేవుడిలాంటి నా భర్త చెప్పిన మంచి చెడు కూడా వినలేదు అని ప్రభావతి అంటుంది.

వీడు నిన్ను ఎంత ప్రేమించాడు. కనీసం కట్టుకున్న భర్తకైనా నిజం చెప్పా...