భారతదేశం, మే 11 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన తప్పుకు క్షమించేది లేదని ప్రభావతి స్పష్టం చేస్తుంది. అటు ఆమె చేసిన పనికి ఆవేశంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోహిణికి తల్లి సుగుణ కూడా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మనోజ్ కు రోహిణి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. నువ్వు ఎందుకు చేతగానివాడివి.. ఓ దిష్టిబొమ్మవి.. నిన్ను కాపాడటానికి నేను ప్రయత్నిస్తే.. తప్పంతా నాదా అని మీ అమ్మతో కొట్టిస్తావా.. ఆమె కొడుతున్నా చూస్తూ ఊరుకుంటావా.. అని మనోజ్ ను రోహిణి నిలదీస్తుంది.

నువ్వు మాట్లాడింది కూడా తప్పే కదా.. నాకు ఎంత అవమానంగా, బాధగా ఉందో తెలుసా అని మనోజ్ అంటాడు. నాలుగు మాటలు అంటేనే అంత బాధగా ఉంటే.. అందరి ముందూ అత్తయ్య కొడుతుంటే నాకు ఎలా ఉం...