భారతదేశం, మార్చి 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివను మీనా, సుమతి కొట్టి తిడతారు. వాళ్లను ఆపి వీడి అంతు చూస్తాను, ఇంతకింత బదులు తీర్చుకుంటాను అని ప్రభావతి అంటుంది. మీనా క్షమించమని అంటుంది. అయినా ప్రభావతి వినదు.

నేను తెచ్చుకున్న కోడళ్లు ధనవంతులు, నువ్వే ముష్టి కుటుంబం నుంచి వచ్చావ్. ఇలా చేసేకన్నా ముష్టి ఎత్తుకోవడం నయం. నువ్ నా కోడలు అని తెలిస్తే ఊరంతా పరువు పోతుంది. ఇకనుంచి నువ్వు ఈ కొంపలోనే పడి ఉండు. మళ్లీ మా ఇంట్లో అడుగుపెడితే గుమ్మం ముందే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.

కూతురు కూడా పుట్టింట్లో ఉంటే ఆ బాధ తట్టుకోలేవమ్మా. వాడు చేసినదానికి దీనికి శిక్ష వేయకండని ప్రభావతి కాళ్లు పట్టుకుంటుంది పార్వతి. మీనా ఆపుతుంది. అయినా ప్రభావతి వినదు. ఆరోజు సారీ చెబుదామన...