భారతదేశం, మార్చి 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ తిక్క కుదుర్చుతుంది మీనా. తన ఇంటికి వచ్చిన తన బంధువులను కనీసం తినకుండా వెళ్లిపోయేలా చేసిన అత్తకు మీనా గట్టిగానే సమాధానం ఇస్తుంది. నోటికొచ్చినట్లు మాట్లాడిన మనోజ్ ను ఎడాపెడా బాదుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మార్చి 10) ఎపిసోడ్ తండ్రికి బాలు సారీ చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత రవి ఉదయాన్ని రెడీ అవుతుంటాడు. తనకు జ్వరం వచ్చిందని, తాను లీవ్ పెట్టానని, నువ్వు కూడా పెట్టాలని శృతి అడుగుతుంది. అప్పుడే నీతూ ఫోన్ చేస్తుంది. అదే విషయం రవి చెబితే.. తాను వచ్చిన తర్వాత తొలి పెద్ద ఆర్డర్ వచ్చింది.. కచ్చితంగా రావాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. దీంతో శృతిని వదిలేసి రవి వెళ్లిపోతాడు.

తాను అంత చెప్పినా వినకపోవడంతో శృతి అలుగుతుంది. తన లగేజీ సర్దుకొన...