భారతదేశం, ఆగస్టు 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో అత్తను ప్రసన్నం చేసుకోవడానికి రోహిణి పడే తంటాలు, శివను కాపాడటంలో సాయం చేసిన అరుణ్ కు థ్యాంక్స్ చెప్పడానికి సుమతి, పార్వతి అతని ఇంటికి వెళ్లడం, కొత్త ఆర్డర్ కోసం వెళ్లిన మీనాకు మరోసారి చింతామణి అడ్డుపడే సీన్లు చూడొచ్చు.

మేకప్ చేస్తే వచ్చిన డబ్బును అత్త ప్రభావతి చేతుల్లో రోహిణి పెట్టే సీన్ తో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. ఈ డబ్బు తనకు ఎందుకు ఇస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. తాను చేసిన తప్పులకు ఇది ప్రాయశ్చిత్తం అని రోహిణి అంటుంది.

అంటే నేను డబ్బు మనిషిని అని, నన్ను డబ్బుతో కొంటున్నావా.. నాకు వద్దు అని ఆమె అనడంతో బాలు షాక్ తింటాడు. తన మార్క్ ఎగతాళితో ప్రభావతి, రోహిణి పరువు తీస్తాడు. అటు మనోజ్ ...