భారతదేశం, ఏప్రిల్ 29 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా మళ్లీ కలిసిపోతారు. అటు మనోజ్, రోహిణి కొత్త విల్లా కొనడానికి సిద్ధమవుతారు. కానీ వాళ్లకు అనూహ్యంగా ఇంట్లో వాళ్ల నుంచే అడ్డంకులు ఎదురువుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 29) ఎపిసోడ్ బాలు కోసం మీనా కంగారు పడే సీన్ తో మొదలవుతుంది. అతనికి పదే పదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. చివరికి స్విచ్ఛాఫ్ చేస్తాడు. దీంతో మీనా మరింత ఆందోళన చెందుతుంది. అత్త అనుమానించినట్లు ఏదైనా జరిగిందా అని కూడా భయపడుతుంది. అలాంటిదేమీ జరిగి ఉండదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది.

బాలు కోసం అటు సత్యం కూడా టెన్షన్ పడుతుంటాడు. ప్రభావతి వచ్చి తిందామని చెప్పినా నీ చేత్తో వడ్డిస్తే అజీర్తి అవుతుందని అంటాడు. అప్ప...