భారతదేశం, ఆగస్టు 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మనోజ్, రోహిణి.. వాళ్లను కలిపేందుకు ఇంట్లో వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగింది. అయితే చివర్లో మనోజ్ షాపుకి భారీ ఆర్డర్ అంటూ వచ్చే ఓ అపరిచితుడు లేడీ కేడీ రోహిణి గురించి బాలుకి తెలియని సీక్రెట్ చెబుతాడు.

రోహిణి తన జీవితంలోకి వచ్చిన తర్వాతే మనోజ్ జీవితం మారిపోయిందంటూ బాలు, మీనా, రవి, శృతి అతనికి చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్ మొదలైంది. రోహిణి విషయంలో ప్రభావతి ఎంత దారుణంగా ప్రవర్తిస్తోందో మనోజ్ కు వివరిస్తారు.

బలవంతంగా ఏటీఎం లాక్కుందని, రోహిణి సంపాదన తీసుకునే హక్కు ఆమెకు లేదని చెబుతారు. ఆమెకు నీకు ఎంతో సాయం చేసిందని, ఇలాంటి కష్ట కాలంలో ఓ భర్తగా రోహిణికి నువ్వే అండగా నిలవాలని, అమ్మని ఈ విషయంలో...