భారతదేశం, ఆగస్టు 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన పని వల్ల సత్యం ఫ్యామిలీ చిన్నాభిన్నమవుతుంది. మనోజ్ తప్పతాగడం, అటు కామాక్షి ఇంట్లో ప్రభావతి సెటిలైపోవడం, రోహిణి జాడలేకపోవడంలాంటి సీన్లతో తాజా ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.

రోహిణి చేసిన పనిని పదే పదే చెబుతూ కామాక్షి దగ్గర ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. దీనికంతటికీ కారణం నువ్వే.. ఆ రోహిణిని నువ్వే పరిచయం చేశావ్ అని కామాక్షిని నిందిస్తుంది. అది ఇంత పని చేస్తుందని అనుకోలేదు.. దానిని సొంత కూతురిలా చూసుకున్నాను.. ముగ్గురు కోడళ్లలో దానికే ఎక్కువ విలువ ఇచ్చాను.. మలేషియా అబద్ధం ఆడి మోసం చేసింది అని ప్రభావతి తన బాధ చెప్పుకుంటుంది.

ముగ్గురు కోడళ్లను సమానంగా చూసుకోవాల్సింది పోయి.. రోహిణికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు....