భారతదేశం, మార్చి 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి ప్లాన్ ఎదురు తిరుగుతుంది. బాలు పేరు చెప్పి ఈ నెల డబ్బులు ఎగ్గొట్టాలని చూసిన మనోజ్ కు.. బాలు దగ్గర ఉన్న వీడియో తీసుకోవాలని చూసిన రోహిణికి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (మార్చి 12) ఎపిసోడ్ రవిని శృతి ఇరికించే సీన్ తో మొదలవుతుంది. రవి తన ఇంటికి వచ్చి ఏడ్చాడని, అంతేకాదు గిఫ్ట్ కూడా ఇచ్చాడని తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ చూపిస్తుంది శృతి. అది చూసి ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. రవిని అదోలా చూస్తారు. ఆ తర్వాత ప్రభావతి రవిని పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది.

ఇలా అలవాటు చేస్తే ప్రతిసారీ పుట్టింటికి వెళ్లి తనకు కావాల్సినవన్నీ సాధించుకుంటుంది అని చెబుతుంది. తనకు ఎప్పుడైనా ఇలా రింగు ఇచ్చావా అని కూడా రవిని అడుగ...