భారతదేశం, సెప్టెంబర్ 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలుకి రోహిణి దొరికినట్లే దొరికి తప్పించుకుంటుంది. దానికి కూడా మనోజ్ నే వాడుకుంటుంది. ఇదే అదునుగా బాలు నుంచి గుణ తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బార్ లో మనోజ్ వెనకాలే గుణ కూర్చోవడం రాజేష్ చూసి కంగారు పడే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. ఈ విషయం వెంటనే బాలుకి చెప్పాలని అతడు అనుకుంటాడు. ఇటు ఇంట్లో వ్రతం కావడంతో రవి ఆకలితో అలమటిస్తుంటాడు.

అతన్ని బాలు ఓదారుస్తాడు. కాస్త నీళ్లు తాగి ఆకలి మంటలు చల్లార్చుకో అని చెబుతాడు. అటు సత్యం కూడా ఆకలికి తట్టుకోలేక బయట కూర్చొని అరటి పండు తినడం చూసి బాలు షాక్ తింటాడు. నీకూ, రవికి కూడా రెండు పండ్లు అక్కడ పెట్టాను తినండి అని సత్యం ...