భారతదేశం, నవంబర్ 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం రవి, నీతూ బిజినెస్ డీల్ చుట్టూనే తిరిగింది. శృతి అడ్డుపడుతుందనుకుంటే ఆమె బలవంతంతోనే ఈ డీల్ కు రవి ఓకే చెబుతాడు. అటు సుమతి పెళ్లి విషయంలో మరోసారి బాలు, మీనా మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మహేష్ అంటూ రోహిణి ఫోన్ లో మాట్లాడే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 20) ఎపిసోడ్ మొదలైంది. రోమియో జూలియట్ బుక్స్ ఇచ్చేవాడివి.. వాటిని చదివి వాటిపైనే మనం డిస్కస్ చేసుకునే వాళ్లమని రోహిణి అనడంతో మనోజ్ షాకవుతాడు.

నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలని ఉంది.. ఒకవేళ నీకు నిద్ర రాకపోతే మళ్లీ ఫోన్ చెయ్ నేను మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అదంతా విన్న మనోజ్ రోహిణి వస్తుండటంతో వెళ్లి పడుకున్నట్లు నటిస్తాడు...