భారతదేశం, నవంబర్ 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో జంబలకిడి పంబ సీన్ కనిపిస్తుంది. మొగుళ్లు పెళ్లాలుగా.. పెళ్లాలు మొగుళ్లుగా మారిపోతారు. అయితే బాలు, మీనా మధ్య మాత్రం సుమతి విషయంలో గొడవ ముదురుతూనే ఉంటుంది. అటు శృతి జీవితంలో నీతూ మరో చిచ్చు పెడుతుంది.

బాలుకి రాజేష్ డబ్బు ఇచ్చే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. మీనా ఇచ్చిన డబ్బునే బాలుకి రాజేష్ ఇస్తాడు. దీంతో బాలు అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత మీనా కూడా రాజేష్ కు థ్యాంక్స్ చెబుతుంది. నీ డబ్బే ఇచ్చి నాకు థ్యాంక్స్ చెబుతావేంటని రాజేష్ అంటాడు.

నా దగ్గర తీసుకోవడం లేదని, అందుకే మీ ద్వారా ఇచ్చానని మీనా చెబుతుంది. ఒకప్పుడు శివ విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. ఇప్పుడు సుమతి విషయంల...