భారతదేశం, ఏప్రిల్ 3 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి బెట్టు వీడుతుంది. మీనా ఇంట్లో వాళ్లకు ఆమె క్షమాపణ చెబుతారు. తర్వాత నాన్నకు రెండో పెళ్లంటూ ఆమెను బాలు రెచ్చగొట్టి తిరిగి ఇంటికి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 3) ఎపిసోడ్ పార్వతి, శివ, సుమతి కలిసి ప్రభావతి దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్పాలనుకునే సీన్ తో మొదలవుతుంది. ఇప్పుడు వద్దని బాలు అంటున్నా.. వాళ్లు వినరు. అటు శివ జైలుకు వెళ్లడం లేదని తెలిసి గుణ కోపంతో రగిలిపోతాడు.

తన ప్లాన్ ఫెయిలవడంతో ఆవేశపడతాడు. శివను వదలనని స్పష్టం చేస్తాడు. అదే సమయంలో దినేష్ బయటకు రావడంతో మరోసారి రోహిణి తనకు ఇస్తానన్న డబ్బు విషయం గుర్తుకు వస్తుంది. అది అంత సులువుగా ఇచ్చే రకం కాదని ...