భారతదేశం, అక్టోబర్ 30 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవీ నవరాత్రుల సందర్భంగా మండపంలో నిద్ర చేసేందుకు సత్యం ఫ్యామిలీ వెళ్తారని అనుకుంటారు. రోహిణి కూడా వస్తానంటే ఇంటికి కాపలాగా ఎవరుంటారని ప్రభావతి అడుగుతుంది.

తనేమైనా మలేషియా నుంచి తెచ్చుకున్న కుక్కనా. తను కూడా వస్తుందని శ్రుతి అంటుంది. అంతా గుడికి వెళ్తారు. లక్కీ డ్రా గురించి రాజేష్‌ను అడిగితే రేపు చేద్దామంటాడు. బాలు ఫ్యామిలీ ఇక్కడే పడుకుంటుందని తెలిసి గుణ ప్లాన్ చేస్తాడు. మరోవైపు సత్యం ఫ్యామిలీ వినోదం కోసం గేమ్ ఆడతారు. చిట్టీలు వస్తే అందులో ఉన్నది ఎందుకో చెప్పాలి.

భర్తలు గొప్పా భార్యలు గొప్పా అని వస్తుంది. భర్తలు, భార్యలు దీనిపై వాదించుకుంటారు. బాలు లాంటివాడిని భరిస్తున్నందుకు నీ భార్య గొప్పదేగా అని మీనాను పొగుడుతుంది ప్...