భారతదేశం, నవంబర్ 3 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నార్మల్‌గా గుడికి వచ్చానని శోభ చెబుతుంది. మీనాకు బాలు పుస్తెలు తీసుకున్నాడు. ఐదుగురు ముత్తయిదువులు పూసలు గుచ్చాలి. ఒకరు తక్కువ అయ్యారనుకుంటున్నా.. సమయానికి వచ్చారు రండి వదిన అని ప్రభావతి అంటుంది.

దాంతో శోభ, ప్రభావతి మీనా పుస్తెల తాడుకు పూసలు గుచ్చి వేస్తారు. తర్వాత లక్కీ డ్రిప్ తీస్తున్నామని రాజేష్ చెబుతాడు. మనోజ్ పరుగెత్తుతాడు. అంతా వెళ్తారు. ప్రైజ్‌లన్నీ తనకే రావాలని మొత్తం 20 వేలతో రిసీట్‌లు మనోజ్ తీసుకున్నాడని రాజేష్ చెబుతాడు. ఫస్ట్ చిట్టీలో మనోజ్ పేరు వస్తుంది. అందులో తాయిత్తు ఉంటుంది.

అది చూసి మనోజ్ షాక్ అవుతాడు. రూ. 20 వేలు పెట్టి తాయిత్తు తీసుకున్నావా అని రవి అంటాడు. ఇంతలో చింతామణి చప్పట్లు కొడుతూ వస్తుంది. అందరూ ...