భారతదేశం, అక్టోబర్ 8 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రెండు తాయత్తులతో మనోజ్ పిచ్చోడిలా, చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అది చూసి ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. తనను నైటీ ఆంటీ అని పిలవడంతో మనోజ్ ను కొడుతుంది శృతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మురళీతో బాలు ఫోన్ మాట్లాడే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మీనాకు విద్య ఫోన్ చేస్తుంది. తాము విల్లా కొంటున్నామని కచ్చితంగా రావాల్సిందే అని చెబుతుంది. అంతేకాదు బాలుని కూడా తీసుకురావాలని చెప్పడంతో ఆయన రారని అంటుంది. కానీ విద్య వినదు. ఇద్దరూ కలిసి రావాలని, నువ్వు నా లవ్ గురు అని విద్య అంటుంది.

మీనా సరే అంటుంది. బాలు వచ్చి ఎవరు అని అడిగితే తన ఫ్రెండ్ ఫోన్ అని చెబుతుంది. మీకెవరు చేశారంటే నా ఫ్రెండ్, న...