భారతదేశం, ఏప్రిల్ 20 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి రెండుసార్లు ప్రాణగండం నుంచి బయటపడుతుంది. ఒకసారి మీనా ఆమెను కాపాడుతుంది. మొదట మనోజ్ చెప్పిన పరిహారానికి అంగీకరించని ఆమె.. తర్వాత సరే అనే పరిస్థితి కలుగుతుంది.

గుండె నిండా గుడి గంటలు సోమవారం (ఏప్రిల్ 20) ఎపిసోడ్ మనోజ్, రోహిణిలకు స్వామీజీ ఇచ్చే వార్నింగ్ తో మొదలవుతుంది. ఈ గుడ్డు వల్ల నీకు ఎన్నో సమస్యలు రాబోతున్నాయి.. రోడ్డుపై పడతావని మనోజ్ ను హెచ్చరిస్తాడు. దీంతో అతడు భయపడిపోతాడు.

నీకు ఇష్టమైన వాళ్లు ఎవరు అని అడిగితే తల్లి పేరు చెబుతాడు. అయితే నీతోపాటు ఆమెకూ గండం ఉందని అంటాడు. ఇక ఇష్టం లేని వాళ్ల గురించి అడిగినప్పుడు బాలు పేరు చెబుతాడు. అతనికి ఇక నుంచి అన్నీ లాభాలే అని అంటాడు.

మనోజ్ కు అది మరింత కోపం తెప్పిస్తుంది. తనకు...