భారతదేశం, మార్చి 13 -- గుండె నిండా గుడ గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సుమతికి పెళ్లి చూపులు జరగడం, కొత్త అల్లుడు కూడా బాలులాగే అత్తకు ధైర్యం చెప్పడం, ఇటు రోహిణికి దినేష్ బెదిరింపులు, మనోజ్ కు మణికంఠ బంపర్ ఆఫర్ లాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్ సుమతికి పెళ్లి చూపులకు రెడీ చేసే సీన్ తో మొదలవుతుంది. తనకు పెళ్లి ఇప్పుడే వద్దని సుమతి అంటున్నా మంచి సంబంధం అంటూ మీనా, బాలు ఒప్పిస్తారు. అయితే పెళ్లి కొడుకుతో తాను ప్రత్యేకంగా మాట్లాడాలని బాలు చెవిలో సుమతి చెబుతుంది. పెళ్లి కొడుకు వాళ్లు వచ్చి సుమతిని చూసి తమకు నచ్చిందని చెబుతారు. అప్పుడే బాలు బలవంతంగా అబ్బాయిని, అమ్మాయిని ప్రత్యేకంగా మాట్లాడుకోమని బయటకు పంపిస్తాడు.

అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్లిన సుమతి తమ ఇంటి గురించి మొత్తం చెబుతుంది. అటు పె...