భారతదేశం, ఏప్రిల్ 8 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో శృతికి అడ్డంగా దొరికిపోతాడు రవి. నీతూని హగ్ చేసుకుండగా చూడటంతో తెగదెంపుల వరకూ వెళ్తుంది. అటు మనోజ్ మరోసారి అడ్డంగా బుక్కవడంతో తనతోపాటు తల్లి ప్రభావతినీ ఇరికిస్తాడు. మరోవైపు రోహిణి దొంగతనం బయటపడే సిచువేషన్ వస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 8) ఎపిసోడ్ మనోజ్ ను ఇంట్లో వాళ్లు యాడ్ షూట్ డబ్బుల కోసం నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ముంబై ముకేష్ డబ్బు ఇచ్చినట్లు ఎందుకు చెప్పలేదని బాలు నిలదీస్తాడు. పూర్తయ్యాక చెబుదామనకున్నా అని అనడంతో అవి కూడా మింగేద్దామనుకున్నావా అని బాలు అతన్ని చితకబాదుతాడు. ఈసారి రవి కూడా అతనికి తోడవుతాడు. ఇద్దరూ అతన్ని వెంట పడి మరీ కొడతారు. ఒక దశలో మనోజ్ మీదికి టీపాయ్ తో దాడికి కూడా రవి సిద్దమవుతాడు.

అట...