భారతదేశం, నవంబర్ 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి, అరుణ్ పెళ్లి కోసం అతని తల్లి మరోసారి మీనా సాయం కోరడం, ఆమె అదే విషయంలో బాలుతో గొడవ పడటం, అటు మహి అంటూ మనోజ్ ను రోహి మరింత ఉడికించడం చూడొచ్చు.

మహేష్ కు ఫోన్ చేయమంటూ మణికంఠను మనోజ్ ఒత్తిడి చేసే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ రిక్వెస్ట్ తో చేసేది లేక మహేశ్వరి నంబర్ కు మణికంఠ కాల్ చేస్తాడు. అవతలి నుంచి ఓ మగ గొంతు హలో అంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని మణికంఠ అడిగితే తన పేరు మహేష్ అని చెబుతాడు. దీంతో మనోజ్ అనుమానం నిజమవుతుంది.

ఇతనితోనే మా ఆవిడ రోజూ గంటల తరబడి మాట్లాడుతోంది.. ఇప్పుడేమీ మాట్లాడొద్దు.. తర్వాత చూద్దాంలే అంటూ మనోజ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే మనోజ్ షాప్‌కి ఓ బిచ్చగాడు వస...