భారతదేశం, అక్టోబర్ 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం ప్రభావతి, రోహిణి తాయత్తులు.. వాటిని వాడుకొని శృతి, బాలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోవడం, అటు మనోజ్ రెండు తాయత్తులతో పిచ్చివాడిలా ప్రవర్తించడంలాంటి సీన్లను చూడొచ్చు.

ప్రభావతి తెచ్చిన తాయత్తు కట్టుకొని మీనా మీనా అని పాట పాడుతూ ఆమెపై బాలు పడే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. మల్లెపూలు చుట్టుకొని, మీనాపై పూలు చల్లుతూ బాలు పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతాడు. మీనా కూడా అతనితో రొమాన్స్ మొదలు పెడుతుంది.

చివరికి అతనికి చేతికి ఉన్న తాయత్తు చూస్తుంది. దీనివల్లేనా ఇదంతా అని అడుగుతుంది. ఇది కట్టుకుంటే పిల్లలు పుడతారని అమ్మ చెప్పిందిగా.. మనం అర్జెంటుగా ఓ క్రికెట్ టీమ్ ను కనేయాలని అంటాడు. దీం...