భారతదేశం, నవంబర్ 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి కోసం సత్యం ఫ్యామిలీ అంతా ఒక్కటవుతుంది. తమ ఇంటిపై కన్నేసి ఒకరు, అదే అదునుగా కాళ్లు పట్టించుకోవడానికి మరొకరు రాగా.. వాళ్లను తరిమేస్తారు. ఇంట్లో చిన్నదైనా కూడా సమయానికి కోర్టు ఆర్డర్ తో ఇంటిని తాత్కాలికంగా కాపాడుతుంది శృతి.

మనోజ్ కారణంగా ఇల్లు కోల్పోయే పరిస్థితి రావడంతో బాలు అతనికి క్లాస్ పీకుతాడు. తన విధి వక్రించిందని మనోజ్ అంటాడు. దీంతో బాలు మరింత రెచ్చిపోతాడు. వాడికేదీ కలిసి రావడం లేదంటూ ప్రభావతి వెనకేసుకొస్తుంది. సత్యం జోక్యం చేసుకుంటూ ప్రభావతికి క్లాస్ పీకుతాడు. బాలు ఎందుకు నోరు మూయాలి.. వాడు అడిగే ప్రశ్నల్లో నిజం లేదా.. ఇవే ప్రశ్నలు నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నించడం లేదా అని నిలదీస్తాడు. ఈ ఇల్లు పోతే...