భారతదేశం, జూలై 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చింతామణి అన్నంత పని చేస్తుంది. ఈవెంట్ మేనేజర్ తో కలిసి మీనాను దారుణంగా మోసం చేస్తుంది. లక్ష అడ్వాన్స్ ఇచ్చి పది లక్షలు ఇచ్చినట్లుగా మేనేజర్ చెప్పడంతో మీనా లబోదిబోమంటుంది. అటు చింతామణి భర్త దగ్గరే ఆమె అప్పు చేయడం మరో పెద్ద ట్విస్ట్.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జులై 17) ఎపిసోడ్ ఫైనాన్షియర్ దగ్గరికి డబ్బు కోసం మీనా వెళ్లే సీన్ తో మొదలైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫైనాన్షియర్ చింతామణి భర్తే కావడం. డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండే ఆ వ్యక్తి.. మీనా చెప్పిన మాటలు, ఆమె కష్టం గురించి విని ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ.లక్షలు డబ్బు ఇస్తాడు.

నీలాగా కష్టపడి పైకి ఎదిగిన వాళ్లంటే తనకు గౌరవమని అంటాడు. ...