భారతదేశం, అక్టోబర్ 12 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతిని గదిలోనుంచి బయటకు పొమ్మనడంపై మనోజ్‌ను సత్యం నిలదీస్తాడు. నేను నార్మల్‌గా అన్నాను అని మనోజ్ అంటాడు. నాపై గట్టిగా అరవలేదా అని ప్రభావతి అడుగుతుంది.

ఏదో టెన్షన్‌లో అన్నానని, గట్టిగా అరవడం అంతగా అబ్జర్వ్ చేయలేదని మనోజ్ అంటాడు. అయితే, శిక్ష పడాల్సిందే అని మనోజ్‌ను మోకాళ్లపై కూర్చోబెడతాడు బాలు. చిన్నప్పటి పగ తీరిందని బాలు అంటాడు. రేయ్ అమ్మకోసం ఈ మాత్రం చేయలేనా. ఇదేకాదు ఏదైనా చేస్తాను అని మనోజ్ అంటాడు. హమ్మయ్య తాయిత్తు పనిచేస్తుంది అని ప్రభావతి అనుకుంటుంది.

రేయ్ లేవురా అని సత్యం అంటే.. అమ్మ చెప్పేవరకు లేవనని మనోజ్ అంటాడు. సరే మాటలు అని ఇప్పుడు మోకాళ్లపై కూర్చుంటే ఏమొస్తుంది అని ప్రభావతి అంటుంది. దాంతో నాపై కోపం పోయిన...