భారతదేశం, సెప్టెంబర్ 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి దగ్గరికి కామాక్షి వచ్చి మీనా 5 లక్షల దొంగతనం గురించి అడుగుతుంది. మీనాను అపార్థం చేసుకున్నందుకు ప్రభావతిని తిట్టి.. నీకు రోహిణియే కరెక్ట్ అంటుంది. మీనాను పిలుస్తుంది కామాక్షి.

మీనా చేయి చూసి జాలిపడుతుంది. దొంగతనం ఎలా జరిగిందో అడిగితే.. మీనా చెబుతుంది. దాంతో దొంగతనం చేయించినవాళ్లను తిడుతుంది కామాక్షి. ప్రభావతి చాలా కాలం తర్వాత వంట వండటంపై సెటైర్లు వేస్తుంది కామాక్షి. జాగ్రత్తగా ఉండమని కామాక్షి చెబుతుంది. ఇంకెప్పుడైనా డబ్బుతో బయటకు వెళ్లేటప్పుడు ఎవరికి చెప్పకు. ఏ శాడిస్ట్, కోపిస్టి, పాపిస్టి కళ్లు పడతాయో అని ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతినే అంటుంది.

నువ్వు ఇంట్లోకెళ్లి తీసుకెళ్లిన డబ్బు విషయం ఎక్కడో పుట్టిన దొంగలకెలా...