భారతదేశం, అక్టోబర్ 26 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు స్నానానికి వెళ్తూ మీనాను రమ్మంటాడు. మిమ్మల్ని నొక్కుతానని మీనా అనడంతో బాలు వెళ్తాడు. బాలు కోసం స్పెషల్‌గా వంటలు చేస్తుంది మీనా. రవి అడిగితే.. బావగారు పెద్ద కేసు నుంచి బయటపడ్డారుగా. అందుకే మా అక్క మా బావగారి కోసం స్పెషల్స్ చేసిందని శ్రుతి అంటుంది.

వాడేమైనా దేశం కోసం వెళ్లి వచ్చాడా అని మనోజ్ అంటాడు. ఇవన్నీ మింగే పెద్ద బావగారు ఏదో కూస్తున్నారు చూడండని శ్రుతి అంటే.. నోరు అదుపులో పెట్టుకోమని రోహిణి వారిస్తుంది. అక్కా.. పెద్దక్కా.. ఆ ముక్క ముందు మీ భర్తకి చెప్పు అని శ్రుతి అంటుంది. యాక్సిడెంట్ చేసి వచ్చాడని మనోజ్ అంటే.. ఇంతలో బాలు వచ్చి మీరు చేసినదాని గురించి మాట్లాడమంటారా అంటాడు.

నాకు ఆకలేస్తుంది అని డైనింగ్ టేబుల్‌పై ...