భారతదేశం, ఆగస్టు 30 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక రాఖీలు కట్టేందుకు వెళ్తానంటే సంజు ఒప్పుకోడు. నేను వెళ్తానను మౌనిక గట్టిగా అంటే.. అయితే, నేను కట్టిన తాళి తీసి మీ ఇంటికే వెళ్లిపోయి ఉండు అని సంజు అంటాడు.

దాంతో మౌనిక షాక్ అవుతుంది. నాతో నా ఇంట్లో ఉండాలంటే నీ హక్కులన్నీ నా కాళ్లకిందే ఉండాలని, రాఖీలు చెత్తబుట్టలో పడేసేందుకు వెళ్తాడు సంజు. మౌనిక వద్దని వారిస్తుంటే ముందుకు తోసేస్తాడు సంజు. మౌనికను సంజు తల్లి సువర్ణ పట్టుకుంటుంది. రాఖీలను చెత్తబుట్టలో పడేస్తాడు సంజు. రాఖీల గురించి అత్తకు చెబుతుంది మౌనిక.

సంజును వారిస్తుంది సువర్ణ. వెళ్లనివ్వురా అని సువర్ణ అంటుంది. సంజు వద్దంటాడు. తన బాలు అన్నయ్య ఎంతగానో ఏడుస్తాడని మౌనిక చెబుతుంది. వాడి ఏడుపు నాకెందుకు అని సంజు అంటాడు. ఆ ...