భారతదేశం, ఆగస్టు 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అరుణ్ బైక్‌పై సుమతి వెళ్తుంది. ఇద్దరు షికార్లు కొడతారు. ఇంటికి కొంత దూరంలో సుమతిని అరుణ్ డ్రాప్ చేస్తాడు. అది మీనా చూస్తుంది. అయితే, హెల్మెట్ ఉండటం, సైడ్ నుంచి మీనా చూడటంతో అరుణ్ మీనాకు కనిపించడు.

ఇంటి దగ్గరే డ్రాప్ చేసేవాన్నిగా అని అరుణ్ అంటే.. అయితే, వెంటనే మళ్లీ మీరే తీసుకెళ్లాలి. మా అమ్మ చూస్తే గెంటిస్తుందిగా అని సుమతి సెటైర్ వేస్తుంది. అరుణ్, సుమతి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అరుణ్ వెళ్లిపోతాడు. ఎవరితను, సుమతి దించేసి వెళ్లిపోయాడు అని మీనా డౌట్ పడుతుంది. ఇంట్లో పార్వతికి సుమతి అన్నం తినిపిస్తుంది.

ఇప్పుడు ఇబ్బంది లేదుగా. ఎప్పుడు చద్దన్నం తినకు అని సుమతి అంటుంది. మీనా వస్తుంది. రోహిణి గురించి పార్వతి అడిగితే.. అమ...