భారతదేశం, జూలై 14 -- Gunde Ninda Gudi Gantalu Serial: స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మీనా పాత్రకు మరో పెద్ద కష్టమే రాబోతున్నట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆమె అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న చింతామణి.. మీనాను పెద్ద ఆర్డర్ పేరుతో ఇరికించాలని గట్టి ప్లానే వేసింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. పూల డెకరేషన్ లలో వరుస ఆర్డర్లు సంపాదిస్తూ ఆ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉన్న చింతామణికి మీనా షాకిస్తున్న సంగతి తెలుసు కదా. మీనాను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసినా కుదరదు. దీంతో ఆమెను ఇరికించడానికి ఓ పెద్ద ప్లానే చేస్తుంది.

ఈ క్రమంలో మీనాకు ఓ పెద్ద ఆర్డర్ వస్తుంది. ఓ వ్యక్తిని ఆమెను రమ్మని పిలుస్తాడు. మీ గత డెకరేషన్లు చూశాను.. చాలా బాగున్నాయి.. ...