భారతదేశం, ఏప్రిల్ 8 -- Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో మీనాను వేధించడానికి ప్రభావతికి మరో అవకాశం దొరుకుతుంది. రోహిణి చేసిన దొంగతనం కాస్తా అనుకోకుండా మీనా మెడకు చుట్టుకుంటుంది. కామాక్షి ఇంటికి వెళ్లి అక్కడ కిచెన్ లో కాఫీ పెట్టడమే మీనా చేసిన నేరమవుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కామాక్షి ఇంటికి మీనా పూలు తీసుకొస్తుంది. అప్పటికే ప్రభావతి అక్కడ ఉంటుంది. దీంతో ఇద్దరికీ తాను కాఫీ పెడతానని ఆమె చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది.

అప్పుడే ప్రభావతి దగ్గరికి ఆమె స్టూడెంట్ తల్లి తాను చీరల వ్యాపారం చేస్తానంటూ వస్తుంది. కామాక్షి, ప్రభావతికి కొన్ని చీరలు చూపిస్తుంది. అందులో ఒక చీర ఆమెకు బాగా నచ్చుతుంది. దాని ధర రూ.45 వేలు అని చెప్పడంతో ప్రభావతి షాక్ తింటుంది. రేటు చెప్పగానే మాట ర...