భారతదేశం, ఏప్రిల్ 4 -- Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమోలో ప్రభావతిని అసలు సీక్రెట్ ఏంటో రోహిణి తెలుసుకున్నట్లుగా చూపించారు. ఈ మధ్య రసవత్తరంగా సాగుతూ ప్రతి ఎపిసోడ్ ను రక్తి కట్టిస్తున్న మేకర్స్.. తర్వాతి ఎపిసోడ్ ను మరింత ఆసక్తిగా మలిచినట్లు దీనిని చూస్తే తెలుస్తోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రాబోయే సోమవారం (ఏప్రిల్ 6) ఎపిసోడ్ లో అత్త ప్రభావతి తన కేసు వాపసు తీసుకోవడం, ఇంటికి తిరిగి రావడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో రోహిణి తెలుసుకోబోతోంది. ఆమె తిరిగి వచ్చినప్పటి నుంచీ అనుమానంగానే చూసిన రోహిణి.. ఇవే విషయాన్ని మనోజ్ తో చెబుతుంది. ఆ తర్వాత మెల్లగా కామాక్షి ఇంటికి వెళ్లి ఆమెకు సేవలు చేస్తుంది.

అసలు అత్తయ్య ఇంత త్వరగా ఇంటికి వస్తుందని అనుకోలేదు అని అంటుంది. దీంతో లాయర్ ఇచ్చిన రూ.2 లక్షల వల్ల ఆమె ఇంటి...