భారతదేశం, మే 19 -- Gullak Season 5: ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా 'గుల్లక్'. నార్త్ ఇండియాలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం (మిశ్రా ఫ్యామిలీ) చుట్టూ తిరిగే ఈ సిరీస్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన నాలుగు సీజన్లు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా, తాజాగా ఐదో సీజన్‌కు (Gullak Season 5) సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' (Sony LIV) ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.

"ఇది కేవలం నిరీక్షణ మాత్రమే కాదు.. కొత్త కథల తలుపు తట్టడం" (Yeh sirf intezaar nahi, naye kisson ki dastak hai) అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'గుల్లక్ సీజన్ 5' త్వరలోనే కేవలం సోనీ లివ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.

సాధారణ మ...