భారతదేశం, మే 29 -- IPL 2026 qualifier 2 : ఐపీఎల్​ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 ఎడిషన్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్​ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్​ మధ్య క్వాలిఫైయర్​ 2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్​లో అందరి చూపు యంగ్​ గన్ వైభవ్​ సూర్యవంశీపైనే ఉంది. బుధవారం ఎస్​ఆర్​హెచ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ 15ఏళ్ల బుడ్డోడి బ్యాటింగ్​కి అందరు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కీలక మ్యాచ్​ వెదర్​ రిపోర్టు, పిచ్​ రిపోర్టు, ఇరు జట్ల స్టాట్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

చంఢీగఢ్​లోని మహారాజ యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జీటీ వర్సెస్​ ఆర్​ఆర్​ మధ్య క్వాలిఫైయర్-2 జరగనుంది. జియో హా...