భారతదేశం, మే 25 -- భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు తమ రోజును గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నిమ్మరసం నీళ్లతో ప్రారంభిస్తుంటారు. పొట్ట కొవ్వును కరిగించుకోవడంలో ఇవి ఎఫెక్టివ్​ అవ్వడమే ఇందుకు కారణం. అయితే, ఈ రెండింటిలో ఏది వేగంగా పనిచేస్తుంది? 'జర్నల్ ఆఫ్ ఒబెసిటీ' పరిశోధనల ప్రకారం.. గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ నేరుగా కొవ్వును కరిగిస్తాయి. మరోవైపు నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గాలనుకునే వారికి ఏది ఉత్తమమో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే విలక్షణమైన పోషకాలు:

క్యాటచిన్స్, కెఫిన్: గ్రీన్ టీలో 'ఈజీసీజీ' (epigallocatechin gallate) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ (క్యాటచిన్), తగినంత క...