భారతదేశం, మే 3 -- Gopichand: వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న మ్యాచో స్టార్ గోపీచంద్.. తాజాగా తన 34వ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. అనార్కలి నాజర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఒకవైపు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భారత వర్ష: సాగా ఆఫ్ శూల' అనే భారీ పీరియడ్ డ్రామాలో నటిస్తూనే.. గోపీచంద్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ కెరీర్‌లో 34వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆదివారం (మే 3) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దామోదర్ ప్రసాద్, రవిశంకర్ డైరెక్టర్ శివ ...