భారతదేశం, నవంబర్ 5 -- కృత్రిమ మేధస్సు (ఏఐ) రేసులో ముందంజలో నిలిచేందుకు ప్రపంచ టెక్ దిగ్గజాలు మైండ్ గేమ్‌తో పాటు వేల కోట్ల డాలర్ల వ్యయాలను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు లేఆఫ్స్​ అని వాలంటరీ ఎగ్జిట్​లను ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ 'గూగుల్' సైతం తమ ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా పథకాలను (వాలంటరీ బైఅవుట్ ఆఫర్స్) అందిస్తోంది.

ఈ ఏడాది జూన్ నెల నుంచే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఎంపిక చేసిన బృందాలకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేయడం ప్రారంభించినట్లు గూగుల్ ప్రతినిధి రాయిటర్స్ సంస్థకు అధికారికంగా ధృవీకరించారు.

ఆల్ఫాబెట్ సంస్థ వ్యయ నియంత్రణ పేరుతో తీసుకొస్తున్న ఈ వాలంటరీ బైఅవుట్ నిర్ణయాలు, గ్లోబల్ టెక్ కారిడార్‌లో పనిచేస్తున్న తెలుగు టెక్కీల ఉద్యోగ...