భారతదేశం, అక్టోబర్ 11 -- డిగ్రీ ఉంటేనే ఉద్యోగం.. అది కూడా ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి ఉత్తీర్ణులైతేనే భారీ ప్యాకేజీలు లభిస్తాయనేది టెక్ ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న నమ్మకం. కానీ, ఆ సాంప్రదాయ నిబంధనలకు గూగుల్​కు చెందిన 'గూగుల్ డీప్‌మైండ్' పూర్తిగా చరమగీతం పాడింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ, మైండ్ బ్లోయింగ్ వేతనంతో కూడిన ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

గూగుల్ డీప్‌మైండ్ నూతనంగా ఏర్పాటు చేసిన 'పొలారిస్' (Polaris) టీమ్ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పొలారిస్ టీమ్ ప్రధానంగా ఏఐ కోడింగ్ ఏజెంట్లు, జెమినీ మోడళ్ల మూల్యాంకన ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు ఏటా 5,50,000 డాలర్ల నుంచి 11,00,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో ...