భారతదేశం, నవంబర్ 13 -- ఐఫోన్ వాడే కారు యజమానులకు టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఎక్స్​పీరియెన్స్​ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులకు మాత్రమే పరిమితమైన 'గూగుల్ జెమినీ' ఏఐ అసిస్టెంట్, ఇప్పుడు యాపిల్ కార్‌ప్లే వేదికపైకి అడుగుపెట్టింది. దీనివల్ల ఐఫోన్ యూజర్లు కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ద్వారా నేరుగా జెమినీతో సంభాషించే అవకాశం లభించింది. గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ట్రాఫిక్‌లో ప్రయాణించే ఉద్యోగుల నుంచి విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని వ్యాపారవేత్తల వరకు నేడు చాలామంది కారు డ్రైవింగ్ సమయంలో యాపిల్ కార్‌ప్లే వినియోగిస్తున్నారు. రద్దీ రోడ్లపై కారు నడుపుతూ ఫోన్ చూడటం ప్రమాదకరం. అలాంటి సమయంలో చేతులతో పనిలేకుండా, కేవలం మాటలతోనే క్లిష్టమైన పనులను చక్కబెట్టేందు...