భారతదేశం, అక్టోబర్ 13 -- టెక్ దిగ్గజం గూగుల్ ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం 'ఫిట్‌బిట్ ఎడ్జ్' పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌వాచ్​లలో హెవీ ఫీచర్లు వద్దనుకునే వారికి, అలాగని స్క్రీన్ లేని సాధారణ బ్యాండ్లు నచ్చని వారికి ఇది సరైన ప్రాధాన్యతగా నిలవనుంది. 179 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 17,000) ప్రాథమిక ధరతో లభించే ఈ వాచ్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫిట్‌బిట్ ఎయిర్ (100 డాలర్లు), గూగుల్ పిక్సెల్ వాచ్ 5 (400 డాలర్ల)ల మధ్య బడ్జెట్ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది.

గూగూల్ ఫిట్‌బిట్ ఎడ్జ్ ట్రాకర్ వాచ్‌లో 1.34 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది గతంలో వచ్చిన ఫిట్‌బిట్ ఛార్జ్ 6 కంటే 46 శాతం పెద్దదిగా ఉండటంతో పాటు 'ఆల్వేస్ ఆన్' సదుపాయాన్ని కలిగి ఉంది. వర్కౌట్లను నిలిపివేయడానికి, మెనూలను ...