భారతదేశం, జూలై 7 -- జులై 7, మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఎంసీఎక్స్​ (మల్టీ కమొడిటీ ఎక్స్​ఛేంజ్) గోల్డ్​ ఆగస్ట్​ కాంట్రాక్ట్స్​ 0.52శాతం పతనమై రూ. 1,46,148 (10గ్రాములు) వద్ద ట్రేడ్​ అవుతున్నాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ సెప్టెంబర్​ ఫ్యూచర్స్ 1.14శాతం మేర పడి కేజీకి రూ. 2,33,416 వద్ద కొనసాగుతున్నాయి.

జూన్​ నెలలో యూఎస్​ ఫెడ్​ రిజర్వ్ పాలసీ సమావేశానికి సంబంధించిన "మినిట్స్​" జులై 8న వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం బంగారం, వెండి ధరలు డౌన్​ అవుతున్నాయి.

అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, తద్వారా వచ్చిన ద్రవ్యోల్బణ సమస్యల కారణంగా ఈ ఏడాది 3 రేట్​ హైక్స్​ ఉంటాయని మార్కెట్​ భావించింది. కానీ భౌగోళిక అనిశ్చితులు తగ్గడం, ముడి చమురు ధరలు పడటం, అమెరికాలో జూన్​కి సంబంధించిన ఉద్యోగాల డేటా అనుకున్న దాని కన్నా తక్కువగా ...