భారతదేశం, ఏప్రిల్ 15 -- బంగారం ధరల్లో వరుస పెరుగుదలకు నేడు స్వల్ప విరామం లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో భారత బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 15) నాటికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి రేట్లు 0.02 శాతం మేర క్షీణించాయి. అయితే, మార్కెట్‌లో బంగారం ధర ఇంకా రూ. 1,50,000 మార్కు పైనే కొనసాగుతుండటం గమనార్హం.

గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా అమెరికా డాలర్ మళ్లీ పుంజుకోవడం. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. ఇక రెండోది, అమెరికా-ఇరాన్ మధ్య మరో విడత శాంతి చర్చలు జరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గి, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ ప...