భారతదేశం, జూలై 14 -- గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు భారత్‌లో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. మంగళవారం (జూలై 14) దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం ఉదయం 9:13 గంటల సమయానికి పసిడి ధరలు 0.69 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,41,550 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, కిలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.46 శాతం లాభపడి రూ. 2,18,760 వద్ద కొనసాగుతోంది.

ఇరాన్ నౌకాశ్రయాలపై ఆంక్షలు విధించడంతో పాటు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై కొత్తగా షిప్పింగ్ రుసుములు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ ప్రతిపాదన అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపవచ్చనే ...