భారతదేశం, ఆగస్టు 21 -- దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అగ్గితో పోటీపడుతున్నాయి. శుక్రవారం (ఆగస్టు 21) ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు స్పాట్ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో బులియన్ మార్కెట్ కళకళలాడింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ పసిడి కాంట్రాక్టు ధర 0.19 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,60,180 వద్ద ట్రేడైంది. అంతకుముందు రాత్రి ఇది రూ. 1,59,700 వద్ద కొనసాగింది. మరోవైపు, సెప్టెంబర్ వెండి కాంట్రాక్టులు 0.65 శాతం లాభపడి కిలో రూ. 2,45,990 వద్దకు చేరుకున్నాయి.

అమెరికా మార్కెట్లలో పసిడి వరుసగా మూడో వారంలోనూ లాభాల దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.5 శాతం పెరిగి ఔన్సుకు $4,540.18 వద్దకు చేరగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి $4,596.60 వద్ద ట్రేడవుతోంది.

డాలర్ ...