Godavari Floods : భద్రాచలం వద్ద 43 అడుగులకు దగ్గరలో గోదావరి నీటిమట్టం
భారతదేశం, సెప్టెంబర్ 27 -- భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతూ.. ఆదివారం రాత్రి సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగులకు చేరువలో నిలిచింది. రాత్రి 8 గంటల సమయానికి ఈ భద్రాచలం వద్ద గోదారమ్మ నీటి మట్టం 42.80 అడుగులుగా నమోదైంది. 9.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఉపనదుల నుండి ముఖ్యంగా తాలిపేరు నుండి వచ్చిన వరద నీటి కారణంగా ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఉదయం 1 గంటకు 36.60 అడుగులుగా ఉన్న నీటి మట్టం సాయంత్రానికి 42.80 అడుగులకు పెరిగింది. నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, రాబోయే కొద్ది గంటల పాటు నీటి మట్టం స్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి మాత్రం పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని పరీవాహక ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. తాలిపేరు మధ్య త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.