భారతదేశం, జూన్ 2 -- Girija Oak On National Crush And Blue Saree Girl Tag: డిజిటల్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ రావడం ఎంత సులువో, అంతే వేగంగా దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా అంతే సహజంగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 2025లో ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఇంటర్నెట్‌ను ఊపేసిన బ్యూటిపుల్ నటి గిరిజా ఓక్ (Girija Oak) తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

కేవలం ఒక బ్లూ కలర్ శారీ కట్టుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల గిరిజా ఓక్ 'బ్లూ శారీ గర్ల్'గా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నెటిజన్లు ఆమెను ఏకంగా కొత్త 'నేషనల్ క్రష్' అంటూ ట్రెండ్ చేశారు. అయితే, ఈ వైరల్ ఫేమ్‌పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

గిరిజా ఓక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Vi...