భారతదేశం, మే 31 -- Ghattamaneni Jayakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. సాహసమే శ్వాసగా సాగిన ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు మూడో తరం రాబోతుంది. దివంగత రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఘట్టమనేని జ‌య‌కృష్ణ హీరోగా డెబ్యూ చేస్తున్న మూవీ 'శ్రీనివాస మంగాపురం'. దీనికి అజయ్ భూపతి డైరెక్టర్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శనివారం (మే 30) రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో మూవీ టీమ్ ఓ ఈవెంట్ నిర్వహించింది. 'శ్రీను అండ్ మంగా ఇంట్రడక్షన్' పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో జ‌య‌కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

''తాతయ్య జయంతి సందర్భంగా అందరినీ కలవడం సంతోషంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయనపై...