భారతదేశం, జూన్ 15 -- Geethanjali: తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే బెస్ట్ రొమాంటిక్ డ్రామాల్లో 'గీతాంజలి' స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. అక్కినేని నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన ఈ క్లాసిక్ వండర్ ను వెండితెరపై మళ్లీ చూడటానికి ఆడియన్స్ ఎప్పటినుంచో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు నాగార్జున బర్త్‌డే (ఆగస్టు 29) స్పెషల్ ట్రీట్ గా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 28న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు 'శ్రీ పద్మిని సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ తో నాగ్ ఫ్యాన్స్ తో పాటు మంచి లవ్ స్టోరీస్ ఇష్టపడే సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

లెజెండరీ మేకర్ మణిరత్నం (Mani Ratnam) డైరెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా గీతాంజలి. ఈ సినిమాతోనే హీరోయిన్ గా గిరిజా శెట్టర్ టాలీవుడ్ కు పరిచయమై తన బ్యూటిఫుల్ యాక్టింగ్ తో ఆడియన్స్ గుండె...